సిద్ధిపేట జిల్లా ములుగు మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధికి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రత్యేక పూజలు - రాష్ట్ర ఎన్నికల సంఘం
సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలో గల విఘ్నేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రత్యేక పూజలు
అనంతరం ఎన్నికల సంఘం కమిషనర్ మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీలోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించగా ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గజ్వెల్ ఏసీపీ నారాయణ, ఉద్యానవన శాఖ అధికారులు పూజలో పాల్గొన్నారు.