సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆరో విడత హరితహారాన్ని గత 6 రోజులుగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో రోజుకో వార్డు చొప్పున మొక్కలు నాటుతున్నారు. బుధవారం రోజు పట్టణంలోని 18వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆకుల రజిత ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
రోజుకో వార్డు చొప్పున 6 రోజులుగా హరితహారం - హుస్నాబాద్‌లో రోజుకో వార్డు చొప్పున 6 రోజులుగా హరితహారం
హుస్నాబాద్‌లో ఆరు రోజులుగా ఆరో విడత హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజుకో వార్డు చొప్పున 20 వార్డుల్లో మొక్కలు నాటారు. బుధవారం 18వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆకుల రజిత మొక్కలు నాటి.. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
రోజుకో వార్డు చొప్పున 6 రోజులుగా హరితహారం
హరిత హారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని.. ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని రజిత కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణగా మార్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగల నిర్వహించాలని పట్టణ ప్రజలను రజిత కోరారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్