తెలంగాణ

telangana

ETV Bharat / state

'డ్రైవర్​ను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందే' - siddipet-rtc-samme

మినీ సర్వీసు బస్సు డ్రైవర్ సస్పెన్షన్​ను వ్యతిరేకిస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు.

'డ్రైవర్​ను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందే'

By

Published : Sep 13, 2019, 7:50 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలోని బస్ డిపో వద్ద తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టి విధులు బహిష్కరించారు. మినీ బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కగా... కండక్టర్ లేకపోవడం వలన బస్సు డ్రైవర్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఇద్దరు టికెట్ తీసుకోక జరిగిన తప్పిదానికి అధికారులు బాలయ్యను సస్పెండ్ చేశారు. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. కండెక్టర్​ ఉండి ఉంటే ఈ తప్పిదం జరిగేది కాదని వారు తెలిపారు.

'డ్రైవర్​ను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details