RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు - తెలంగాణ పాలిటిక్స్
14:15 June 18
RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్‌లో మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao) వెళ్లారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయపోల్ మండలం నుంచి బేగంపేట పీఎస్‌కు ఎమ్మెల్యేను తరలించారు.
మల్లారెడ్డి ఆత్మహత్య తనను కలచివేసిందని ఎమ్మెల్యే రఘనందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao)) తెలిపారు. ఇల్లును కూల్చివేశారనే ఆవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్య(Malla Reddy Suicide) చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధినైన తనను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానంటుూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు