జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని... ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ పోలీసులు సూచించారు. కొవిడ్ నిబంధనల పట్ల హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండు, వ్యవసాయ మార్కెట్ వద్ద... డ్రైవర్లకు, రైతులకు, ప్రయాణికులకు ఎస్సై శ్రీధర్ అవగాహన కల్పించారు.
కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బస్స్టాండ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్వద్ద... కొవిడ్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. డ్రైవర్లు, రైతులు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
తెలంగాణ వార్తలు
ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కు పెట్టుకోకపోతే వెయ్యిరూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లోను, మార్కెట్ల వద్ద అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి:ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి