సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండల తీవ్రత అధికమై అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, కొహెడ, చిగురుమామిడి మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. మామిడి రైతులకు ఈదురు గాలులతో కురిసిన ఈ వర్షం నష్టాన్ని మిగిల్చింది. కాయలు కిందపడి పగిలిపోవడం వల్ల నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షం... అన్నదాతలకు అపార నష్టం - heavy rain
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అకాల వర్షం... అన్నదాతలకు అపార నష్టం
కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కహానీలు చెప్తున్నారు : షబ్బీర్ అలీ