తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధం

ముఖ్యమంత్రి కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు గజ్వేల్​ నియోజకవర్గ కార్యకర్తలు సిద్ధమయ్యారు. అభిమాన నేత ముఖచిత్రం ఆకారంలో మెుక్కలు పట్టుకుని నిల్చొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

prepare-to-wish-kcr-an-innovative-greeting-in-gajwel-in-siddipet-district
కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధం

By

Published : Feb 15, 2020, 11:34 PM IST

సీఎం కేసీఆర్​కు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కార్యకర్తలు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి పుట్టిన రోజు నేపథ్యంలో ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టారు. బాలికల విద్యా సౌధంలో కేసీఆర్ ముఖచిత్రం ఆకారంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,600 మంది కార్యకర్తలు, అభిమానులు మొక్కలు చేతపట్టుకొని నిల్చొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమూహంగా నిల్చొని తమ అభిమాన నేత ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ కార్యక్రమం చేశారు.

టీఎస్​ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. ఈ వీడియోలను కేసీఆర్ పుట్టినరోజు ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. కేసీఆర్​కు ఎప్పుడు గుర్తుండిపోయేలా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చూడండి:పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ

ABOUT THE AUTHOR

...view details