సిద్దిపేటలో మండుతున్న ఎండలు - husnabad
ఎండలు మండిపోతున్నాయి. రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతున్నారు ప్రజలు. ఎండలకి తోడు వడగాలుల అగ్ని ఆజ్యం పోసినట్లు వీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
మండుతున్న ఎండలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఆరు రోజులుగా ఎండలతో పాటు వడ గాలుల తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రత 44 డిగ్రీలు నమోదవుతుండటంతో నిత్యం రద్దీగా ఉండే ఆఫీస్ రోడ్, గాంధీ చౌరస్తా, బైపాస్ రోడ్, అంబేద్కర్ చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి.