Siddipet Students Stuck in Ukraine: ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంతో.. ఆ దేశంలోని తెలుగు విద్యార్థుల గుండెల్లో గుబులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రమాదం ఎటునుంచి పొంచుకువస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తినడానికి తిండి లేకపోవడతో ఆకలితో అలమటిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నా.. ఏటీఎంలు మూతపడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా విద్యార్థులు.. భయం గుప్పిట్లో బతుకుతున్నారు. స్వదేశానికి చేరుకునే సమయం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ విద్యార్థులను.. స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉక్రెయిన్ అలజడిలో విద్యార్థులు.. ఆందోళనలో వారి తల్లిదండ్రులు
అమ్మా.. ఆకలేస్తుంది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తగరం మనాలి.. జెఫ్రోసియాలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మరో ముగ్గురు తెలుగు విద్యార్థులతో కలిసి ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో.. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. తమకు తినడానికి ఆహారం లేదని, తాగడానికి సైతం మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మనాలి.. ఫోన్ ద్వారా తన తల్లి కవితకు తెలిపారు. గదిలో కూడా లైట్లు ఆఫ్ చేసి పెట్టుకోవాలని అధికారులు తెలిపారని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కింద ఉన్న బంకులోకి వెళ్లాలని సూచించారని చెప్పారు. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని తమను వేరే ప్రదేశానికి బస్సులో తరలించి అక్కడినుంచి విమానం ఏర్పాటు చేసి.. మన దేశానికి తరలిస్తారని తెలిపారని తల్లికి చరవాణిలో వివరించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు
"మా పాప.. జెఫ్రోసియాలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మా పిల్లల పరిస్థితి ఎలా ఉందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. భోజనం కూడా దొరకడం లేదట. రాత్రి వాళ్లు నిద్ర లేక భయం గుప్పిట్లో బతికామని మా పాప వాపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలి. గురువారం రాత్రి బండి సంజయ్.. మా పాపతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు." -కవిత, మనాలి తల్లి
డబ్బులు కూడా లేవు