కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో విపక్షాలు ధర్నా నిర్వహించాయి. దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా రైతు ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలను చేకూర్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు మద్దతుగా హుస్నాబాద్‌లో విపక్షాల ధర్నా - హుస్నాబాద్ తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో విపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి విపక్ష నేతలు వినతిపత్రం సమర్పించారు.
Opposition parties protest in husnabad junction
కులమత రాజకీయాలను అడ్డుగా పెట్టుకొని దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.