సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల శివారులో దారుణం జరిగింది. మల్లన్న సాగర్ మధ్య కాల్వ పనుల్లో భాగంగా జరిగిన బ్లాస్టింగ్‌లో ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం సురేష్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున వసతి గృహం మేడపై చదువుకుంటున్నాడు. పక్కనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగి ఓ రాయి వచ్చి సురేష్ తలపై పడింది. తీవ్రగాయమై సురేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తోటి విద్యార్థులు చూసి వెంటనే పోలీసులకు సమాచారమందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుతాసుపత్రికి తరలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇప్పటికే ఓ విద్యార్థి మృతి చెందాడని ప్రస్తుతం మరో విద్యార్థి చనిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపించారు. సురేష్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.