తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్.. ఏర్పాట్లు పూర్తి - dubbaka by election news

దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

notification release to dubbaka by election today
దుబ్బాక ఉప ఎన్నికకు

By

Published : Oct 9, 2020, 5:45 AM IST

దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

దుబ్బాక ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దుబ్బాక తాహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడం వల్ల 10, 11 తేదీల్లో నామినేషన్లకు సెలవు ప్రకటించారు. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 19వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.

ఇద్దరిని మాత్రమే..

కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో నామినేషన్ సమర్పణకు అభ్యర్థితో పాటు ఐదుగురికి అవకాశం కల్పించే వారు. కానీ ప్రస్తుతం అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. నామినేషన్​కు వచ్చే అభ్యర్థులు రెండు వాహనాల్లో మాత్రమే రావాలని.. వాటిని రిటర్నింగ్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే నిలపాలని నిబంధనలు విధించారు. కార్యాలయం వద్ద సబ్బు, శానిటైజర్ ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తిని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

నిబంధనలకు అనుగుణంగా ప్రచారం..

రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో నామాపత్రాలు ఇవ్వడంతో పాటు.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించనున్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. కానీ ఆ పత్రాలను తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ప్రధాన పార్టీలు దుబ్బాక ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు అటంకం కల్పిస్తారన్న అనుమానం ఉన్నవారని గుర్తించి బైండోవర్ చేయనున్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రచారం చేయడానికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలాజీ హెచ్చరించారు.

ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారాలతో జోరందుకున్న రాజకీయం.. ఈ రోజు నుంచి మరింత వేడెక్కనుంది.

ఇవీ చూడండి:వరుస ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ కాక

ABOUT THE AUTHOR

...view details