తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒకే తీరూ పంట వేస్తే లాభం ఉండదు' - వానా కాలం-2020 నియంత్రిత పంటల సాగు విధానం

రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థికమంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లోని మహాతి ఆడిటోరియంలో జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితిల సభ్యులకు నూతన వ్యవసాయ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో హరీశ్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

no profit if a single crop is harvested in telangana
'ఒకే తీరూ పంట వేస్తే లాభం ఉండదు'

By

Published : May 24, 2020, 12:08 AM IST

అందరం ఒకే తీరూ పంట వేస్తే లాభం ఉండదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటిద్దామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వానా కాలం-2020 నియంత్రిత పంటల సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. గజ్వేల్లో లక్షా 70 వేల ఎకరాల సాగు భూమి ఉందని, పోయిన వానా కాలంలో 27 వేల ఏకరాల్లో వరి పంట సాగు చేశారని మంత్రి చెప్పారు. కొండ పోచమ్మ సాగర్​కు గోదావరి జలాలు వచ్చాక భూగర్భ జలాలు పెరిగి.. మనకేమీ బాధలు ఉండవని తెలిపారు. కొంత సన్న రకం, కొంత దొడ్డు రకం వరి పంటలు వేద్దామని ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

"వానా కాలం మక్క పంట వేసే బదులు యాసంగికి పోదాం. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే పని చేస్తుంది. మార్కెట్లో ఉన్న డిమాండ్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలి. రైతు బంధు ఇవ్వమనేది.. ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రతి రైతుకు రైతుబంధు అందిస్తాం. వానా కాలం పంట కోసం రైతులకు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్ల బడ్జెట్​లో పెట్టాం. రైతు సంక్షేమానికై, రైతు గౌరవం పెంచడం, రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం."

నియంత్రిత పంటల సాగుపై పలు మండల, గ్రామ ప్రజాప్రతినిధులతో మంత్రి మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్​లు, ఏంపీటీసీలు, ఏంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

'ఒకే తీరూ పంట వేస్తే లాభం ఉండదు'

ఇదీ చూడండి :ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details