సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ప్రారంభం - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సీపీ జోయల్ డేవిస్ ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోలీస్ స్టేషన్లను డిజిటలైజ్ చేస్తూ, ఆఫీసర్లకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తోందని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అన్నారు. దుబ్బాకలో సీఐ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు. పోలీస్ ఆఫీసర్లకు కార్యాలయాలు ఎంతో ముఖ్యమని సీపీ చెప్పారు. ప్రజలు వారి సమస్యలను ప్రత్యక్షంగా కార్యాలయాలకు వచ్చి తెలిపేందుకు ఇదెందో అవసరమని తెలిపారు. దుబ్బాక సర్కిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఫేస్బుక్ ప్రేమ: ఒక్కటైన జపాన్ వధువు, తమిళ వరుడు