మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 14 వార్డులో మురికి గుంటలు, కాలువల్లో అధికారులు వాటర్ బాల్స్ వదిలారు. ప్రతి ఆదివారం మున్సిపాలిటీల్లో మురికి నీరు, నిల్వ నీరు తొలగించాలని మంత్రి కేటీఆర్ జారీ చేసిన ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దుబ్బాక మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
మురికి కాల్వల్లో.. వాటర్ బాల్స్ వదిలిన అధికారులు - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో అధికారులు మురికి కాల్వల్లో వాటర్ బాల్స్ వదిలారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నిల్వ నీటిలో దోమలు పెరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు.
మురికి కాల్వల్లో.. వాటర్ బాల్స్ వదిలిన అధికారులు
మురుగు కాల్వల్లో, నీటి గుంటల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు మన దరిచేరవని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ గన్నె వనిత, కౌన్సిలర్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు