ముంబయిలో అంబేడ్కర్ నివాసం రాజగృహంపై దాడి... రాజ్యాంగంపై దాడితో సమానమని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. నిందితులపై రాజద్రోహం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు సిద్దిపేటలో ఒక రోజు మహా దీక్ష కార్యక్రమం చేపట్టారు.
'రాజగృహ దాడి నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి' - mrps leaders protest news
సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ముంబయిలో అంబేడ్కర్ నివాసంపై దాడి కేసులోని నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
mrps leaders protest in siddipet
ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల చేత రాజగృహానికి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.