సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి, కొండపాక, నంగునూరు మండలాల్లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కొమురవెల్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం బంధారం, నంగునూరు మండలం సిద్దన్నపేట, తిమ్మాయిపల్లి గ్రామాల్లోని పొలాల్లో తిరుగుతూ రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు