తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస ఎన్నారైలు సోషల్ మీడియాలో విష ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు.
'కరువు పీడిత ప్రాంతాన్ని పచ్చగా మార్చాం' - siddipet news
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నారైలందరూ క్రియాశీల పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు
minister harish rao video conference with nri
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నారైలందరూ క్రియాశీల పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాక పూర్తిస్థాయిలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని వివరించారు. ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దుబ్బాకను సీఎం కేసీఆర్ నాయకత్వంలో రామలింగారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తమ బంధువులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులంతా కలిసి సుజాత విజయానికి సహకరించాలని మంత్రి కోరారు.