జిల్లాలో రైతులు ఇక నుంచి ఆరుతడి పంటలు పండించి లాభాలు పొందాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని విఠలాపూర్ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారు ప్రధాన ఎడమ కాల్వ సమీపంలో ఆరుతడి పంటలు పండిస్తున్న ఓ రైతు పొలం వద్ద మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. చంద్లాపూర్ ప్రధాన ఎడమ కాలువ కింద పిల్ల కాల్వ తీసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాల్వ వెంట మంత్రి కలియ తిరిగారు.
ఇంత కష్టపడి నీళ్లు తెస్తే.. తీరా మీరు వరి పంటలు వేస్తే ఏం లాభమని, కూరగాయల పంటలు పండించాలని మంత్రి రైతులకు సూచించారు. వాటి వల్ల వచ్చే లాభాలను వివరిస్తూ.. రైతులకు అవగాహన కల్పించారు.