తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao: ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ: హరీశ్ రావు

ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాకేంద్రంలోని విపంచి గ్రంథాలయంలో మంత్రి నివాళులర్పించారు.

Harish Rao
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు

By

Published : Jul 22, 2021, 9:18 PM IST

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. అన్ని శాఖల్లోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. సిద్దిపేటలోని విపంచి గ్రంథాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. వేముగంటి నర్సింహాచార్యుల చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికై శాశ్వత సభ్యత్వం పొందిన సభ్యులకు గుర్తింపు కార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు హరీశ్​ రావు తెలిపారు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ఇకపై ఏడాదికి ఒకసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే 64 వేల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు.

పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి

రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా వేత్త నలిమెల భాస్కర్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు రంగాచారి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలసాయిరాం, ఆర్డీవో ఆనంతరెడ్డి, ఇతర ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ కొందరు మాత్రం వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఉన్న ఖాళీలపై ప్రతిపక్షాలు చేసే ప్రచారం అవాస్తవం. ఉద్యోగాల భర్తీ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష నియామకం మరొకటి పదోన్నతి ద్వారా జరిగే భర్తీ. అంతే కానీ అన్ని ఉద్యోగాలు డైరెక్ట్​గా ఎవర్నీ నియమించరు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై దృష్టి సారించి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా వైద్య, ఇరిగేషన్​ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి గ్రామం పచ్చగా ఉండాలనే పంచాయతీల అభివృద్ధి కోసం పంచాయతీ సెక్రటరీలను నియమించాం. ప్రస్తుతం అన్నిశాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించాం. ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు.- హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు

ఇవీ చూడండి:

jobs notification: తుది దశకు చేరుకున్నఉద్యోగాల ఖాళీల కసరత్తు

Harish rao: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై మంత్రి హరీశ్ సమీక్ష

Harish Rao: భాగ్యనగరం.. పెట్టుబడులకు స్వర్గధామం: హరీశ్​ రావు

Job recruitment: ఉద్యోగాల ఖాళీలపై అధికారులతో హరీశ్ రావు​ భేటీ

HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details