తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం: మంత్రి హరీశ్​రావు - Free police recruitment training in Siddipet

సిద్దిపేట మల్టీ పర్పస్​ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. త్వరలోనే స్టడీ మెటీరియల్స్​ అందజేస్తామని శిక్షణార్థులకు మంత్రి హరీశ్​రావు భరోసానిచ్చారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి హరీశ్​రావు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి హరీశ్​రావు

By

Published : Jan 22, 2021, 12:15 PM IST

పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో.. ఉచితంగా అల్పాహారం, త్వరలోనే స్టడీ మెటీరియల్స్​ అందజేస్తామని శిక్షణార్థులకు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఉచిత శిక్షణ పొందుతున్న 230 ఉద్యోగార్థులకు భరోసానిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు చెప్పారు.

జిల్లా కేంద్రమైన సిద్దిపేట మల్టీ పర్పస్​ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాత పూర్వక పరీక్షలకు సైతం శిక్షణ ఇస్తామని తెలిపారు. అదే విధంగా 3 నెలల సమయం తర్వాత కావాల్సిన ఫిజికల్​ శిక్షణ సైతం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటితో పాటు మైదానంలో రన్నింగ్ ట్రాక్​, హై జంప్​, లాంగ్​ జంప్​కు కావాల్సిన వసతులు సమకూరుస్తామని హామీనిచ్చారు.

ఈ మేరకు మంత్రి శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులతో కలిసి ముచ్చటించారు. మంత్రి హరీశ్​రావుతో పాటు... ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ కూడా వారితో కలిసి మార్నింగ్ బ్రేక్​ ఫాస్ట్​ చేశారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్​ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని 14,28 వార్డుల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details