సామాజిక మాధ్యమాల్లో భాజపా అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో భాజపా అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేశారని తెలిపారు. గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోవాలని దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌రావు - Minister Harish Rao Latest News
భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. దుబ్బాకలో భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికిస్తున్న నిధులపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2 వేల పింఛనులో 1,600 రూపాయలు మోదీ ఇస్తున్నారని చెబుతున్నారని వెల్లడించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. దుబ్బాక నుంచి బండి సంజయ్‌కు సవాల్ విసిరుతున్నట్లు పేర్కొన్నారు. దుబ్బాక ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా మోదీ ఇవ్వట్లేదని ప్రకటించారు. మోదీ డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ కిట్ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏమైనా కిట్లు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఆసరా పింఛను రూ.2 వేలలో కేంద్రం 1200 ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని... భాజపా కరపత్రాల్లో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేశారు కాబట్టే హుజూర్‌నగర్‌లో భాజపాకి నాలుగో స్థానం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. దుబ్బాక ప్రజలు కూడా భాజపాకు తప్పకుండా గుణపాఠం చెబుతారని ఆకాక్షించారు.
ఇప్పటికైనా భాజపా నేతలు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. ఎప్పుడైనా అతిమంగా ధర్మానిదే విజయమని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు.