గతంలో ప్యాక్స్లకు యాక్టివిటీలు ఉండేవి కావని, ఇప్పుడు ప్యాక్స్ సొసైటీలు బలోపేతం అయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శనిగరం, కూరేల్ల గ్రామాలు ధాన్యం కొనుగోళ్లలో ప్రథమ స్థానంలో నిలిచాయని మంత్రి అన్నారు.
వానాకాలం 2018-19లో పండించిన వరి ధాన్యం కొనుగోలుపై జిల్లాలోని గ్రామైక్య సంఘాలు, ప్యాక్స్లకు... 95 కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి రూ.2.30 కోట్లు కమీషన్ సేవా రుసుం చెల్లింపు కార్యక్రమాన్ని సిద్ధిపేట కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు.
మిట్టపల్లి మహిళలు పప్పు దినుసులు పట్టించే మిషనరీ తెచ్చి అమ్మకాలు జరువుతున్నారు. దీంతో మహిళలకు ఉపాధి, ప్రజలకు నాణ్యమైన పప్పు లభిస్తుంది. వారి మాదిరిగా మీరు చేస్తామంటే.. కేంద్ర ప్రభుత్వ సహకార సంస్థ సహకారం అందిస్తాం. ఇందుకోసం మరో అడుగు ముందుకేసి ఆర్థిక పరిపుష్టి కలిగిన మహిళా సంఘాలు ముందుకు రావాలి. మిమ్మల్ని ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తాం.- హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ప్రతినెలా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో.. ఎజెండాగా మూడు అంశాలు పెట్టాలని, వాటిలో ప్రస్తుత కరోనా వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ.., భయపడొద్దని సూచించారు.
ఇదీ చూడండి:ప్రైవేటీకరణకు భారతీయ రైల్వే సిద్ధంగానే ఉందా?