తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు సాయం చేసిన వారే నిజమైన సంపన్నులు'

కష్టకాలంలో పేదలకు సాయం చేసిన వారే నిజమైన సంపన్నులని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో కొవిడ్​ సహృదయ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పలువురు చేనేత కార్మికులకు నిత్యావసరాలు అందించారు.

minister harish rao distributed Essential goods to handloom workers in siddipet
'పేదలకు సాయం చేసిన వారే నిజమైన సంపన్నులు'

By

Published : May 10, 2020, 10:58 AM IST

పేదలకు సాయం చేసిన వారే నిజమైన సంపన్నులని.. ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తోటివారికి తమకు చేతనైన సాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని నీలకంఠ సమాజం భవనంలో కొవిడ్​ సహృదయ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు నిత్యావసరాలు, గర్భిణీలకు శ్రీమంతం ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్​రావు హాజరై.. సుమారు 400 మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు, 21 మంది గర్భిణీలకు ఒక్కొక్కరికి రూ.10 వేల విలువైన వెండి సామగ్రి, పట్టువస్త్రాలు అందజేశారు.

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు రూ.10 లక్షల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్​ సభ్యులను అభినందించారు. సిద్దిపేట జిల్లా గ్రీన్​ జోన్​లో ఉందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మంత్రి సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దన్నారు. మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండి.. లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కొవిడ్​ సహృదయ ఫౌండేషన్​ డైరెక్టర్ అనూహ్యరెడ్డి, నీలకంఠం సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details