సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో నియోజకవర్గానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు మంత్రి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు. అందజేసిన చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు.
నిరుపేదలకు సహాయం.. సీఎం సహాయనిధి: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో 63 మంది లబ్ధిదారులకు రూ. 15,66,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి హరీశ్‌రావు.. తన నివాసంలో అందజేశారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాల్లో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు.
నిరుపేదలకు సహాయం.. సీఎం సహాయనిధి: మంత్రి హరీశ్‌రావు
లబ్ధిదారుల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన 26 మందికి రూ. 6,75,500, గ్రామీణ మండలానికి చెందిన 10 మందికి రూ. 2,37,000, అర్బన్ మండలానికి చెందిన నలుగురికి రూ. 1,05,500, చిన్నకోడూర్ మండలానికి చెందిన ఏడుగురికి రూ. 2,12,000, నంగునూరుకు చెందిన 10 మందికి రూ. 2,43,500, నారాయణరావుపేట మండలంలోని ఆరుగురికి రూ. 93 వేలు.. మొత్తం రూ. 15,66,500 విలువైన చెక్కులను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి:దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్