తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరేశ్వరున్ని దర్నించుకునే అవకాశం దక్కింది: హరీశ్​రావు - Minister Harish Rao at the Siddipet Dharmik Utsav Samithi Sammelan

సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. శివరాత్రికి నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గనందునా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అమరేశ్వరున్ని దర్నించుకునే అవకాశం దక్కింది: మంత్రి హరీశ్​రావు
అమరేశ్వరున్ని దర్నించుకునే అవకాశం దక్కింది: మంత్రి హరీశ్​రావు

By

Published : Jan 8, 2021, 10:55 AM IST

శివరాత్రి సందర్భంగా అమరేశ్వరున్ని దర్శించుకునే అవకాశాన్ని సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి కల్పించిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. వర్గల్ శ్రీ విద్యా సరస్వతీ ఆలయంలో నిర్వహించిన... సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

రాబోయే శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గనందునా.... సామూహిక కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అమరేశ్వరున్ని దర్నించుకునే అవకాశం దక్కింది: మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details