సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు సిద్దిపేట ప్రతినిధి చింత నాగరాజు అకాల మరణం పట్ల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాగరాజు మరణం తన మనసును కలిచివేసిందని కంటతడి పెట్టుకున్నారు. ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయానన్నారు. జర్నలిస్టుగా నిరాడంబరతకు, నిబద్ధతకు మారుపేరుగా సంస్థకు అందించిన సేవలను కొనియాడారు. జర్నలిస్టుగా ఆయన రాసిన కథనాలు ప్రజాపక్షం వైపు, సామాజిక, మానవతా కోణాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు మృతి పట్ల మంత్రి హరీశ్ విచారం
సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు సిద్దిపేట ప్రతినిధి చింత నాగరాజు ఆకస్మిక మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయుణ్ణి కోల్పోయానని కంటతడి పెట్టుకున్నారు. నాగరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు మృతి పట్ల మంత్రి హరీశ్ విచారం
కరోనా మహమ్మారి కళ్ల ముందు ఉన్న వ్యక్తిని కానరాని లోకాలకు తీసుకెళ్లిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎంత ప్రయత్నం చేసినా బతికించుకోలేకపోయామన్నారు. ఒక గంట క్రితమే మాట్లాడిన వ్యక్తి ఇప్పుడిక లేడన్న విషయం కలచివేస్తోందన్నారు. నాగరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండి: వారంలోగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్: కేటీఆర్
Last Updated : Apr 21, 2021, 8:06 PM IST