సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. సభలో పార్టీ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల్లో నైరాశ్యం నెలకొందన్నారు. ఎస్సీలు, గిరిజనులు వారి హక్కుల సాధన కోసం సన్నద్ధమయ్యారని తెలిపారు. ఎస్సీలు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మోదీజీ, షాజీ 70ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారని.. దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ మాత్రమే అంతా చేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇందిరా గాంధీ వల్లే మెదక్‌కు పరిశ్రమలు
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నది మర్చిపోయారా? అంటూ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. దేశం కోసం కాంగ్రెస్ నేతలు ఎందరో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పారు. ఇందిరా గాంధీ మెదక్ నుంచే పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ వల్లే మెదక్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఎస్సీలు, గిరిజనులకు హక్కులు కల్పించిందే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ అని అన్నారు. ఎస్సీలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాలు పొందారని.. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోనియా గాంధీ దేశం కోసం ప్రధాని పదవిని త్యాగం చేశారని చెప్పారు.
అనేక చట్టలు తీసుకొచ్చాం