సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో కాలనీలోని కమ్యూనిటీ హాల్ ఆవరణలో సిద్ధిపేట మున్సిపాలిటీ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డిలు కలిసి మొక్కలు నాటారు. బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ వందేళ్లు వర్ధిల్లాలని వంద మొక్కలు నాటి ఆకాంక్షించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాటిన ప్రతీ మొక్క కాపాడుకుంటామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్ యాదవ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సంపత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటీఆర్ జన్మదినం.. మొక్కలు నాటిన మున్సిపల్, సుడా ఛైర్మన్లు - సిద్దిపేట వార్తలు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ కాలనీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి వంద మొక్కలు నాటారు.
కేటీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన సిద్ధిపేట మున్సిపల్, సుడా ఛైర్మన్లు