తెలంగాణ

telangana

ETV Bharat / state

మరణించిన నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం - వేలూరుగ్రామంలో పర్యటించిన కోదండరాం

సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నర్సింలు కుటుంబీకులను టీజేఏసీ ఛైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Kodandaram visited the family of the narsimlu who committed suicide in Veluru village in Siddipet
నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం

By

Published : Aug 2, 2020, 5:34 PM IST

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నర్సింలు కుటుంబాన్ని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నర్సింలు దశదిన కర్మ జరిగేలోపు బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనడాలన్నారు.

దళితులపై దాడులు జరిపి భూమిని గుంచుకోవడం వంటి చర్యలను మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇయ్యక పోగా ఉన్నది గుంజుకోవడం బాధాకరమని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.

భూమికి భూమి ఇయ్యమని నర్సింలు కోరినా వినకుండా భూమిని లాక్కోవడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. అతని అంత్యక్రియలను కూడా పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటు ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న ఏ అధికారీ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాకపోవడం తీవ్ర బాధాకరమన్నారు.

ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details