తెలంగాణ

telangana

ETV Bharat / state

కిలో కోడి మాంసం రూ. 39, 42

కిలో కోడి మాంసం రూ. 39 అంటూ బోర్డులు పెట్టి అమ్ముతున్నారు.. మునుపెన్నడూ లేనివిధంగా కూరగాయల ధరలతో పోలిస్తే కోడి మాంసం ధర తక్కువగా ఉంది. అయినప్పటికీ.. కరోనా భయంతో ప్రజలు కోడి మాసం తినడం లేదంటూ వ్యాపారులు వాపోతున్నారు.

Kg of chicken meat for Rs. 39, 42 at husnabad siddipet
కిలో కోడి మాంసం రూ. 39, 42

By

Published : Mar 13, 2020, 11:22 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కిలో కోడి మాంసం రూ. 39, 42కే విక్రయిస్తున్నారు. కూరగాయల కన్నా కోడి మాంసం ధర తక్కువగా ఉందంటూ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓవైపు రోగాలతో కోళ్లు చనిపోతుండగా, మరోవైపు కరోనా వైరస్ కారణంగా కోడి మాంసం అమ్మకాలు పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్​కు కోడి మాంసానికి సంబంధం లేదంటూ ఇటీవల హైదరాబాద్​లో రాష్ట్ర మంత్రులు చికెన్ మేళా నిర్వహించారు. అయినా పెద్దగా ప్రభావం చూపడం లేదు.

ధరలు పడిపోతున్నా కోడిమాంసాన్ని కొనడానికి మాంస ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. అపోహలు లేని వారు మాత్రమే చికెన్ కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఏది ఏమైనా మూడు నెలల క్రితం రూ. 200 వందలకు పైన పలికిన కిలో కోడి మాంసము ధర ప్రస్తుతం అమాంతం పడిపోయింది.

కిలో కోడి మాంసం రూ. 39, 42

ఇదీ చూడండి :'ఆదాయానికి... బడ్జెట్​ అచనాలకు పొంతన లేదు'

ABOUT THE AUTHOR

...view details