తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు చింతమడకలో ఓటు వేయనున్న కేసీఆర్​

రేపు సీఎం కేసీఆర్​.. సతీ సమేతంగా తన సొంత గ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. ఓటేసేందుకు హెలిక్యాప్టర్​​లో వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే హరీశ్​ రావు పరిశీలించారు.

By

Published : Apr 10, 2019, 5:27 PM IST

సీఎం కేసీఆర్​

రేపు లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో గులాబీ బాస్​ సతీ సమేతంగా వెళ్లి ఓటు వేయనున్నారు. స్వగ్రామానికి కేసీఆర్​ హెలిక్యాప్టర్​లో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్​ పనులు, చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎమ్మెల్యే హరీశ్​ రావు... డీసీపీ నర్సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లో హైదరాబాద్ చేరుకోనున్నారు.

సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details