కార్తిక పౌర్ణిమ పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
నరసింహుని సన్నిధిలో కార్తికపౌర్ణిమ వేడుకలు - నాచారం
కార్తిక పౌర్ణిమను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా నాచారంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
నరసింహుని సన్నిధిలో కార్తికపౌర్ణిమ వేడుకలు