తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి' - హుస్నాబాద్ వార్తలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మండల పరిషత్​ సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బహిష్కరించారు. సమావేశానికి విద్యుత్, నీటిపారుదల, ఎక్సైజ్​, పోలీస్​, రెవెన్యూ శాఖల అధికారులు హాజరుకాలేదని నిరసన తెలిపారు. తమ గ్రామ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు.

'మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి'
'మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి'

By

Published : Mar 16, 2020, 6:16 PM IST

'మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బహిష్కరించారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి జరిగే సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాలి. అయితే ఈ సమావేశంతో పాటు ఇదివరకు జరిగిన రెండు సమావేశాలకు.. ప్రధాన శాఖలకు చెందిన విద్యుత్, ఇరిగేషన్, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు హాజరవలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి, మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధికారులు రాకపోవడం వల్ల తమ గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకొని పరిష్కరించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గ్రామాల్లో నెరవేర్చలంటే అధికారులు సహకరించడం లేదని.. అందువల్ల తాము గ్రామాల్లో పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టలేక పోతున్నామని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీవోను సంప్రదించగా హాజరవని అధికారులకు మెమోలు జారీ చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details