తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యాహ్న భోజన పథకం అమలుకై విద్యార్థినుల ధర్నా - మధ్యాహ్న భోజన పథకం కోసం విద్యార్థినుల ధర్నా

తమకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.

విద్యార్థినుల ధర్నా

By

Published : Aug 26, 2019, 5:14 PM IST

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థినుల ధర్నా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అద్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి... విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సహకారంతో కొద్ది రోజులు మధ్యాహ్న భోజనం పెట్టారని... అనంతరం పథకం అమలు చేయడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ప్రతి రోజూ పస్తులుంటూ పాఠాలు వింటున్నామని వాపోయారు. సర్కారు ఇకనైనా స్పందించి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధాకర్​ విద్యార్థినులతో మాట్లాడి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details