సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా నేతలు ఇంటింటికీ మోదీ సందేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 19వ వార్డులో రఘునందన్‌రావుతో పాటు.. మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎంగారి రాజిరెడ్డి పర్యటించారు. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇంటిటికీ మోదీ సందేశం కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలు దేశవ్యాప్తంగా అనుభవిస్తున్నారని రాజిరెడ్డి తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ ఎస్ఎన్ చారి, తదితరులు పాల్గొన్నారు.
ఇంటిటికి మోదీ సందేశం.. భాజపా నేతల ప్రచారం - సిద్ధిపేట వార్తలు
నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో రెండోసారి భాజపా అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా నేతలు ఇంటిటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. మోదీ సారథ్యంలో దేశం ప్రపంచంలో మొదటిస్థానంలో నిలవడం ఖాయమని అన్నారు.
దుబ్బాకలో..ఇంటిటికి మోడీ సందేశం!