ఇంట్లో ఉంటే ఉక్కపోత... బయటకు వస్తే నిప్పుల కుంపటి... ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేకా... బయటకు రాలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. యువత... వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ ఉపశమనం పొందుతున్నారు.
భానుడి భగభగల ప్రతాపం ... బావులే కదా ఉపశమనం - heavy sunny in telangana
భానుడు భగభగా మండిపోతున్నాడు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఫ్యాన్లు కూలర్లు సైతం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించలేకపోతున్నాయి. ఉపశమనం కోసం ప్రజలు వ్యవసాయ బావుల్లో ఈతలు కొడుతున్నారు.
భానుడి భగభగలకు వ్యవసాయ బావులతోనే ఉపశమనం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన ఓ కుటుంబం వారి సొంత వ్యవసాయ బావిలో పగటిపూట ఈతకొడుతూ కనిపించింది. హైదరాబాద్లో నివాసముండే ఆ కుటుంబం లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చారు. యువతీ యువకులందరూ కలిసి సరదాగా ఈత కొట్టారు. మధ్యాహ్న వేళల్లో కుటుంబ సభ్యులతో కలిసి బావిలో ఈత కొడుతూ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.