సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వరద నీటితో పత్తి, వరి చేలు నీట మునిగాయి. చెరువులు, చెక్‌డ్యాంలు నిండు కుండలా మారాయి. చిన్న కోడూరు, నంగనూరు, సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావు పేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
ఎడతెరిపిలేని వర్షం... నీట మునిగిన పంట పొలాలు
ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిద్దిపేట పట్టణంలో వరద నీటితో పంటలు నీట మునగగా.. రోడ్లు జలమయమయ్యాయి. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపిలేని వర్షం... నీట మునిగిన పంట పొలాలు
పలు చోట్ల పాత ఇళ్లు నేల కూలాాయి. చేతికొచ్చిన పంట వర్షాల వల్ల పాడైపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు నీట మునిగి వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చూడండి:అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం