తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షం... జలమయమైన పొలాలు - సిద్ధిపేట

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో సిద్ధిపేట పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. చెరువులు, వాగులు నిండుకుండలా మారాయి.

heavy-rain-in-siddipet
ఎడతెరిపి లేని వర్షం... జలమయమైన పొలాలు

By

Published : Sep 26, 2020, 4:38 PM IST

రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో సిద్దిపేట పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వర్షపు నీటితో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షం ధాటికి పంట నష్టం జరిగింది. పత్తి, మొక్కజొన్న, వరి పొలాల్లో నీళ్లు నిలిచాయి. చెరువులు, చెక్ డ్యాములు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిండు కుండలా చెరువులు..

ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు, చిన్నకోడూరు, నారాయణ రావు పేట, సిద్దిపేట రూరల్ సిద్దిపేట, అర్బన్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో చెరువులు నిండుకుండలా మారాయి. రోడ్లపై నీరు చేరడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details