తెలంగాణ

telangana

ETV Bharat / state

అధైర్య పడకండి... ఆదుకుంటాం: హరీశ్​రావు - harsishrav

అన్నదాతకు అండగా ఉంటాం... అధైర్య పడకండి... ఆదుకుంటాం- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ

రైతులను పరామర్శించిన హరీశ్ రావు

By

Published : Apr 21, 2019, 5:13 PM IST

సిద్దిపేటలో కురిసిన వడగండ్ల వానకు చిన్నకోడూర్ మండలంలోని వరి, మామిడి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో పంట పొలాలను, మామిడి తోటలను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి రైతులను పరామర్శించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమని అన్నారు. నష్టపోయిన పంటలు, మామిడి తోటలపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధైర్య పడకండి... అండగా ఉంటామని భరోసానిచ్చారు. రైతులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు.

రైతులను పరామర్శించిన హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details