బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా అక్టోబర్ నెల నిలవాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలన్నారు. 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు గల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, వైద్యులు రఘురాం పాల్గొన్నారు.
సిద్దిపేట నుంచి తొలి అడుగు: హరీశ్ రావు - anm
బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సిద్దిపేట నుంచి తొలి అడుగు వేయాలన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. మహిళలు వంద శాతం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు మొదటి స్థానంలో నిలవాలన్నారు.
హరీశ్ రావు