తెలంగాణ

telangana

ETV Bharat / state

'పదిమందికి ఉపయోగపడే పని చేయండి' - harish_rao_motivational_speech_for_youngers

ఆత్మ విశ్వాసం, పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే యువతీయువకులు అద్భుతాలు చేయగలరని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

'పదిమందికి ఉపయోగపడే పని చేయండి'

By

Published : Sep 24, 2019, 10:01 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసి భవనంలో యువశక్తి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతీ యువకులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పని చేస్తే అనేక అద్భుతాలు చేయొచ్చని హరీశ్​రావు పేర్కొన్నారు. పదిమంది చేసే పని కాకుండా పదిమందికి ఉపయోగపడే పనిని ఉపాధిగా ఎంచుకుంటే విజయం సాధిస్తామని తెలిపారు. ఫ్యాన్ కింద కూర్చొనే జాబులే చేయాలనే ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలని... కష్టపడి పని చేసి సొంతంగా ఎదిగే విధంగా తమను తాము రూపుదిద్దుకోవాలని మంత్రి సూచించారు.

'పదిమందికి ఉపయోగపడే పని చేయండి'

ABOUT THE AUTHOR

...view details