ETV Bharat / state
కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా చూపిద్దాం - కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం
కేసీఆర్ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే ఎంపీ ఎన్నికలలో తెరాస అఖండ విజయం సాధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం
By
Published : Mar 23, 2019, 5:58 AM IST
| Updated : Mar 23, 2019, 7:26 AM IST
కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్, భాజపాతో పోటీ లేదని పేర్కొన్నారు. మెజార్టీ విషయంలో మన ఎంపీలు ఒకరితో ఒకరు పోటీ పడే పరిస్థితి ఉందన్నారు. మెదక్ సభలో కేటీఆర్ కరీంనగర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తానని చేసిన సవాల్‌ను గుర్తుచేశారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మెదక్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాలని కోరారు. Last Updated : Mar 23, 2019, 7:26 AM IST