మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, సింగారంలలో నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సిద్దిపేట కలెక్టర్ చేసిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 20 లక్షల రూపాయలు ప్యాకేజీ కింద అందనున్నాయి. కుటుంబంలో 18 ఏళ్లు పైబడిన వారు ఒకరు ఉంటే 32 లక్షల 54 వేలు, ఇద్దరు ఉంటే 45 లక్షల 4 వేలు ఇవ్వనున్నారు. ఎవరైనా రెండు పడక గదుల ఇళ్లు కోరుకుంటే ఏడున్నర లక్షలకు బదులుగా 250 గజాల్లో ప్రభుత్వం ఇళ్ళు నిర్మించి ఇస్తుంది. గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలను గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని జిల్లా పాలనాధికారిని ప్రభుత్వం ఆదేశించింది.
మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు ప్యాకేజీ ప్రకటన
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. 2016 రాష్ట్ర భూసేకరణ, సహాయ, పునరావాస చట్టం ప్రకారం నగదు ఇవ్వనుంది. ఎర్రవెల్లిలో 546 కుటుంబాలకు రూ. 78.31 కోట్లు, సింగారం గ్రామంలో 54 కుటుంబాలకు రూ. 7.27 కోట్లను ప్యాకేజీ కింద అందించనుంది.
పునరావాస ప్యాకేజీ