సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ హాజరయ్యారు. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రైతులు వాటిపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు.
సకాలంలో టీకాలు, మందులను ఇప్పించాలన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఇలాంటి వైద్యశిబిరాలు నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీమతి గుబిరే శారద మల్లేశం, పశు వైద్యాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక పశువైద్య కేంద్రంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ నిర్మల లక్ష్మణ్ అన్నారు.
సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం
TAGGED:
free veterinary medical camp