సిద్దిపేట జిల్లా మిట్టపల్లి, నర్సాపూర్, లింగారెడ్డిపల్లిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రంగనాయకసాగర్ ప్రధాన కుడి కాలువను పరిశీలించారు. పిల్ల కాలువల నిర్మాణానికి భూ సేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించాలని సూచనలు చేశారు.
రంగనాయకసాగర్ కుడి కాలువను పరిశీలించిన హరీశ్ రావు
రంగనాయకసాగర్ కుడి కాలువను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి, నర్సాపూర్, లింగారెడ్డిపల్లిలో వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.
రంగనాయకసాగర్ కుడి కాలువను పరిశీలించిన హరీశ్ రావు
పుష్కలమైన నీటి వనరులతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. కాల్వలతో చెరువులు, కుంటలు నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇదీ చూడండి:సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు