తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్​ను సస్యశ్యామలం చేస్తాం' - అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పర్యటించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు. మండలంలో పలు రైతువేదిక భవనాలను ఆయన ప్రారంభించారు. మంత్రి వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ ఉన్నారు.

'కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్​ను సస్యశ్యామలం చేస్తాం'
'కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్​ను సస్యశ్యామలం చేస్తాం'

By

Published : Feb 8, 2021, 8:55 PM IST

రాష్ట్ర బడ్జెట్​లో వ్యవసాయ అనుబంధ రంగాలపై మూడో వంతు నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఉగాది తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.

'కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్​ను సస్యశ్యామలం చేస్తాం'

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని జనగాం, అంతకపేట, మల్లంపల్లి, రామవరం, పోతారం(జే) గ్రామాల్లో రైతువేదిక భవనాలను, పెద్దతండా గ్రామంలో బీటీ రోడ్డును మంత్రి, ఎమ్మెల్యే సతీశ్​కుమార్​తో కలిసి ప్రారంభించారు.

పామాయిల్ తోటల సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి కోరారు. ఇందుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీ ఇస్తోందన్నారు. యాసంగి నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి... కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

ఇదీ చూడండి:రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details