సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుమారు 40 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉన్నా.. అధికారులు అక్రమంగా ఇతరులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
కోర్టు వివాదంలో ఉన్న భూములకు పట్టాలెలా ఇస్తారు?
కోర్టు వివాదంలో ఉన్న భూములకు అధికారులు.. అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ ఎస్సీ, ఎస్టీలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ రుక్మిణి.. 40 ఎకరాల భూ వివాదంపై విచారణ జరిపించి పట్టా పాసు పుస్తకాలను రద్దు చేయిస్తానని హామీ ఇచ్చినా.. రైతులు ఆందోళన విరమించలేదు. తమ భూమి సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పట్టా పాసుపుస్తకాలు సృష్టించారని ఆరోపించారు. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః నీటి సంపులో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం