ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్‌రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మొదటిసారిగా పర్యటించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీశ్ నివాసానికి చేరుకుని తమ అభిమాన నాయకునికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానం చేస్తూ... మిఠాయిలు తినిపించారు. కొంతమంది యువత మంత్రి హరీశ్ రావుతో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా కురిసి... ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. నిమజ్జనం రోజు ఆటపాటల నడుమ ఆనందోత్సాహాలతో వినాయకున్ని సాగనంపాలని కోరారు.
ఆర్థిక మంత్రి హరీశ్‌కు అభిమానుల ఘన స్వాగతం - హరీశ్‌రావు
ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా సిద్దిపేటకు చేరుకున్న హరీశ్‌రావుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. తమ ప్రియతమ నేతను మంత్రి హోదాలో చూసి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పూల వర్షంతో స్వాగతం పలికారు.
Fans give grand welcome to Finance Minister Harish