తెలంగాణ

telangana

ETV Bharat / state

వెయ్యి సభ్యత్వాలు చేస్తే అమిత్​షాను కలిసే అవకాశం

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

వెయ్యి సభ్యత్వాలు చేస్తే అమిత్​షాను కలిసే అవకాశం

By

Published : Jul 15, 2019, 11:08 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భాజపా సభ్యత్వ నమోదును మాజీ మంత్రి డీకే అరుణ ప్రారంభించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రఘునందన్​రావుతో కలిసి పాల్గొన్న ఆమె మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని 100 నుంచి వెయ్యి వరకు సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన కింద ప్రతి ఇంటికి వంట గ్యాస్ పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు గురించి గ్రామాల్లో తెలియచేయాలన్నారు. వెయ్యి సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి అమిత్​షాను కలిసే అవకాశం వస్తుందన్నారు.

వెయ్యి సభ్యత్వాలు చేస్తే అమిత్​షాను కలిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details